13-08-2025 12:30:17 AM
జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్
గద్వాల, ఆగస్టు 12 ( విజయక్రాంతి ) : వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే విధంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా ఎస్పీ తో కలిసి తహసిల్దార్ లు, ఎంపీడీవోలతో వర్షాల వల్ల నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన మందస్తు జాగ్రత్తలు చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
జిల్లాలో ప్రమాదకర పరిస్థితులు లేనప్పటికిని రాబోయే రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. ఈనెల 16, 17 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, మండల స్థాయి టీంలను ఏర్పాటు చేయడం జరిగిందని, అధికారులు సెల వులో వెళ్లకుండ హెడ్ క్వార్టర్స్ లోనే ఉంటూ వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఇరిగేషన్ శాఖ ఏస్.ఈ రహీముద్దీన్, జిల్లా పంచాయతీ అధికారి నా గేంద్రం, జిల్లా విద్యాధికారి సిద్ధప్ప, జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్, వివిధ శాఖల అధికారులు అన్ని మండలాల తహసీల్దారులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.