13-08-2025 12:29:07 AM
దక్షిణ మధ్య రైల్వే జీఎంను కోరిన ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్‌బాబు
కాగజ్‌నగర్, ఆగస్టు ౧౨ (విజయక్రాంతి): సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఎస్.కే శ్రీవాస్తవ కలిసి రైల్వేకు సంబంధించిన పలు ప్రతిపాదనలను సమర్పించిన సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. సికింద్రాబాద్ - నాగపూర్ వందే భారత్ రైలును సిర్పూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లో హాల్టింగ్ ఇవ్వాలని కోరారు.
ఇటీవల కాజీపేటకు వచ్చిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లానని అన్నా రు. సానుకూలంగా స్పందించిన జీఎం ఈ విషయమై రైల్వే బోర్డుకు సమాచారం ఇచ్చామని, హాల్టింగ్ ఇచ్చేందుకు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగజ్ నగ ర్ రైల్వే స్టేషన్ లో ఆధునిక సదుపాయాల కల్పన కోసం నిధులు కేటాయించాలని జీఎం ను కోరారు.
సానుకూలంగా స్పందించిన జీఎం రూ.19 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగజ్ నగర్ పట్టణంలోని సంజీవయ్య కాలనీ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మా ణం త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. రూ.9 కోట్ల అంచనాతో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పూర్తి అయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
చింతగూడ , ఈజ్గాం లైన్ క్రాసింగ్ ను ఎత్తివేసి ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని కోరడం జరిగిందని, జీఎం స్పందిస్తూ రూ.120 కోట్ల అంచనాతో రైల్వే స్పెషల్ ప్రాజెక్టుగా ఈ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాన్ని చేపట్టనున్నామని, త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామన్నామని తెలిపారు.