calender_icon.png 11 December, 2025 | 10:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల విధులను అధికారులు ఉత్సాహంగా నిర్వహించాలి

10-12-2025 07:45:41 PM

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్..

ఖానాపూర్ (విజయక్రాంతి): ఎన్నికల విధుల్లో పాల్గొనబోయే అధికారులు ఎటువంటి ఒత్తిడి లేకుండా, ఉత్సాహంగా తమ విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం పెంబి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్, కౌంటర్లవారీగా సిబ్బందిని, వారికి కేటాయించిన సామాగ్రి తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ, మొదటి దశ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు.

ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినమని వివరించారు. త్వరగా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తగు ఏర్పాటు చేసుకోవాలన్నారు. రేపు ఉదయం సమయానికి పోలింగ్ ప్రక్రియ ప్రారంభించాలని తెలిపారు. ఎన్నికల అనంతరం, వారికి అందించిన సామాగ్రి అంతటిని తిరిగి అధికారులకు అప్పజెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఏఎస్పీలు రాజేష్ మీనా, ఉపేంద్ర రెడ్డి, ఆర్డిఓ రత్న కళ్యాణి, మండల ప్రత్యేక అధికారి నరసింహారెడ్డి, డిఈఓ భోజన్న, తహసిల్దార్ లక్ష్మణ్,  ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.