calender_icon.png 21 May, 2025 | 3:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులు దిగజారి ప్రవర్తించొద్దు

21-05-2025 12:45:15 AM

  1. అతిక్రమిస్తే చర్యలు తప్పవు
  2. సీఎస్ రామకృష్ణారావు ఆదేశాలు

హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): బహిరంగ సమావేశాలు, సభల్లో అధికారులు, ఉద్యోగులు దిగజారి ప్రవర్తించొద్దని, అతిక్రమిస్తే చర్యలు తప్పవని సీఎస్ రామకృష్ణారావు హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ఇటీవల సమావేశాలు, సభల్లో చోటు చేసుకుంటున్నకొన్నిసంఘటనలు అవాంఛనీయమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అభిప్రాయపడ్డారు.

ఇలాంటి ప్రవర్తన ప్రజల్లో ఆ సర్వీసు అధికారుల మీద నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుందన్నారు. అఖిల భారత సేవల ప్రవర్తనా నియమావళి, 1968లోని నిబంధన 3(1) ప్రకారం ప్రతీ సర్వీసులో సభ్యుడు ఎల్లప్పుడూ సంపూర్ణ నిజాయతీ, విధిపట్ల నిబద్ధత కలిగి ఉండాలన్నారు.

కాగా నాగర్‌కర్నూల్ జిల్లా అ చ్చంపేట నియోజకవర్గంలో సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్న అధికారిక కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి శరత్ రేవంత్‌రెడ్డి కాళ్లు మొక్కిన విషయం తెలిసిందే. దీనిపైనా సీఎస్ రామకృష్ణారావు సీరియస్ అయ్యారు. అధికారులెవ్వరూ ఇలా ప్రవర్తించొద్దని ఆదేశించారు.