calender_icon.png 11 September, 2025 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోరాటాన్ని గుర్తించింది గత సీఎం కేసీఆరే..

10-09-2025 10:03:55 PM

ఎమ్మెల్యే అనిల్ జాదవ్..

అదిలాబాద్ (విజయక్రాంతి): భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం నిఖార్సుగా పోరాడిన వీరనారి ఐలమ్మ అని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్(MLA Anil Jadhav) అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా నేరడిగొండ మండలంలోని తేజపూర్ గ్రామంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని, ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విగ్రహ ఆవరణలో రజక సంఘం సభ్యులతో కలిసి మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ ఉద్యమాలతో ఎంతో మంది స్ఫూర్తి పొందరన్నారు. తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీర వనిత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధైర్యశైలిగా పెరుపొందరన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం మే చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు.