04-08-2025 01:26:59 AM
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): హైడల్ పవర్‌తోపాటు పంపుడ్ స్టోరేజ్‌తో పెద్దఎత్తున విద్యుత్‌ను ఉత్పత్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని, అందుకోసం రాష్ట్రంలో 23 పాయింట్లను గుర్తించి సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆదివారం కొల్లాపూర్ నియోజకవ ర్గంలోని సోమశిల వద్ద జెన్‌కో, ట్రాన్స్‌కో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. జూరాల నుంచి పులిచింతల వరకు కృష్ణా మీద ఉన్న హైడల్ పవర్ ప్రాజెక్టులను సమీక్ష చేసి అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అవసరమైతే ప్రపంచ పేరుగాం చిన కన్సల్టెంట్ల సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. సోలార్ ద్వారా జరిగే ఉత్పత్తిని స్టోరేజ్ చేసి రాత్రివేళ ఉపయోగించేలా అవసరమైన సాంకేతికతను, స్టోరేజ్ వ్యవస్థను రూపొందించుకోవాలన్నా రు.
1978లోనే రివర్స్ పంపింగ్ కోసం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జపాన్‌కు చెందిన తోషి బా, మిస్టుబుషి లాంటి దిగ్గజ సంస్థల సాం కేతికతను ఉపయోగించిన ఆనాటి పాలకులు, ఇంజినీర్ల ముందుచూపును కొని యాడారు. రాబోయే తరాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పర్యావరణ హితమైన పవర్‌ను ఉత్పత్తి చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని, రాబోయే 20 ఏళ్లకు సరిపడా విద్యుత్ డిమాండ్‌కు అవసరమైన ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
సీఎండీ నుంచి కిందిస్థాయి సిబ్బం ది వరకు అందరికీ అవసరమైన సాంకేతికతను పెంపొం దించుకోవడానికి సిలబస్ రూపొందించి, మూడు రోజుల శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. గ్రీన్ హైడ్రోజన్, ఫ్లోటింగ్ సోలార్, రూఫ్ సోలార్ థర్మల్ పవర్, పవన విద్యుత్, అణు విద్యుత్ బ్యా టరీ స్టోరేజ్ లాంటి ప్రత్యామ్నాయ విద్యుత్ కోసం వినియోగాన్ని ఎక్కువ మొత్తంలో అభివృద్ధి చేసుకోవాలన్నారు.