calender_icon.png 25 August, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓజీ రెండో గీతం వస్తోంది

25-08-2025 12:52:48 AM

పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓజీ’. దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ పాన్-ఇండియా గ్యాంగ్ స్టర్ థ్రిల్లర్‌ను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దాన య్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో ప్రియాంక అరుళ్ మో హన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ న టుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించనున్నారు. అర్జున్‌దాస్, శ్రియారెడ్డి, ప్రకాశ్‌రాజ్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ముం బయి బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న విడుదల కానుంది. వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న ఈ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేయనున్నట్టు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ‘సువ్వి సువ్వి..’ అంటూ సాగే ఈ మెలోడీని వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27న విడుదల కానున్నట్టు ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ పోస్టర్‌లో పవన్, ప్రియాంక లుక్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి తమన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.