08-07-2025 01:53:12 AM
జిల్లా ఉద్యాన అధికారి అనంత రెడ్డి
నల్లగొండ టౌన్, జూలై 7 : వరి పంటకు ప్రత్యామ్నాయంగా, మూడు రెట్లు అధిక దిగుబడి ఆదాయాన్ని అందించే ఆయిల్ పామ్ పంట లను సాగు చేయాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి పిన్నపురెడ్డి అనంత రెడ్డి సూచించారు. సోమవారం ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో, ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ లో భాగంగా నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలో బిల్లాల సత్తి రెడ్డి ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో, పతంజలి ఫుడ్స్ ఆయిల్ పామ్ కంపెనీ భాగస్వామ్యంతో ఆయిల్ పామ్ మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు.
ఆయిల్ పామ్ మొక్కను ఒకసారి నాటితే 4 వ సంవత్సరం నుండి నిర్విరామంగా 30 సంవత్సరాల వరకు ఎకరానికి 10 నుండి 12 టన్నుల దిగుబడిని ఇస్తుందని తెలిపారు. దీని ద్వారా ఎకరానికి లక్ష ఇరవై వేల నుండి లక్ష యాభై వేల వరకు ఆదాయాన్ని పొందవచ్చని పేర్కొన్నారు.
కార్యక్రమంలో నార్కట్పల్లి ఉద్యాన అధికారి శ్వేత, పతంజలి ఫుడ్స్ జిల్లా జనరల్ మేనేజర్ రవీందర్ రెడ్డి , ఆయిల్ పామ్ కంపెనీ ప్రతినిధులు వినయ్, శ్రీనివాస్, వంశీ, డ్రిప్ కంపెనీ ప్రతినిధులు శేఖర్, శ్రీనివాస్ రెడ్డి గ్రామ రైతులు వెంకట్ రెడ్డి, సత్తిరెడ్డి, నర్సి రెడ్డి, రాములు, విజయ్ పాల్గొన్నారు.