calender_icon.png 9 July, 2025 | 12:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా వైఎస్సార్ జన్మదిన వేడుకలు

08-07-2025 05:53:32 PM

మహాదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మహదేవపూర్ మండల కేంద్రంలో దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు కటకం అశోక్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. అశోక్ మాట్లాడుతూ... పేద ప్రజల మన్ననలు పొందిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని పేద ప్రజల కోసం ఆరోగ్య శ్రీ పథకం, ఫీజు రియంబర్నమెంట్ లాంటి పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోట రాజబాబు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అక్బర్ ఖాన్, ఫ్యాక్స్ చైర్మన్ చల్ల తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ రాణి బాయి,మాజీ ఎంపీటీసీ ఆకుతోట సుధాకర్, మాజీ పాక్స్ చైర్మన్ వామన్ రావు, అంబట్ పల్లి మాజీ సర్పంచ్ ఎరవెల్లి విలాస్ రావు, కాలేశ్వర దేవస్థానం డైరెక్టర్ కుంభం పద్మ , కాంగ్రెస్ పార్టీ నాయకులు తడకల జగదీశ్,దాగం సంతోష్, రాఘవేంద్ర,కడర్ల నాగరాజు, చెక్రధర్,పోత రామకృష్ణ, చెంద్రశేఖర్ రెడ్డి,అయిత తిరుపతి రెడ్డి, శంకర్, బాపు లక్ష్మయ్య, వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు  పాల్గొన్నారు.