08-07-2025 06:04:53 PM
బిజెపి నాయకులు, జిల్లా మాజీ ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షులు ములుమూరి శ్రీనివాస్..
రామగిరి (విజయక్రాంతి): సింగరేణి కంపెనీ(Singareni Collieries Company Ltd)లో ఉన్న లాంగ్ స్టాండింగ్ అధికారులను వెంటనే బదిలీ చేయాలని రామగిరి మండల బిజెపి సీనియర్ నాయకులు, జిల్లా మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ములుమూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం సెంటినరీ కాలనీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... సింగరేణి వ్యాప్తంగా ఉన్న లాంగ్ స్టాండింగ్ అధికారులను ఎందుకు బదిలీ చేయడం లేదని ప్రశ్నించారు.
వీరిని బదిలీ చేయకపోవడం వల్ల ఒకే ఏరియాలో ఉంటూ అవినీతికి పాల్పడే అవకాశం ఉందని, అంతేగాక ఫోకల్ పాయింట్ లలో ఉన్న అధికారులు మూడు సంవత్సరాలకు మించి ఉండకూడదనే నిబంధన ఉన్న కూడా గత పది సంవత్సరాలుగా ఒకే ఏరియాలో కొనసాగుతున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని అధికారులను ప్రశ్నించారు. సింగరేణిలో ఉన్న లాంగ్ స్టాండింగ్ అధికారులను వెంటనే బదిలీ చేయాలి, లేనిచో ఇట్టి అంశాన్ని బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు తీగల శ్రీధర్, మెరుగు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.