24-07-2025 12:26:11 AM
నిర్మల్, జూలై 23 (విజయక్రాంతి): ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆయిల్ ఫామ్ తోటలు సాగుచేసిన రైతులకు ఆయిల్ ఫామ్ గెలలు అమ్ముకునేందుకు నిర్మల్ జిల్లాలోని పరిశ్రమను ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుకు కాంగ్రెస్ నేతలు వినతిపత్రం అందించారు.
హైదరాబాదులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జూపల్లి ని కలిసిన డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు మార్కెట్ కమిటీ చైర్మన్ పటేల్ నిర్మల్ జిల్లాలో ఆయిల్ ఫారం పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనంగా ఉంటుందని అందుకొనుగుణంగా ప్రభు త్వం చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. తప్పకుండా నిర్మల్లో పరిశ్రమ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు