24-07-2025 12:26:51 AM
జిల్లా జడ్డీ ప్రేమలత
గద్వాల టౌన్ జూలై 23 : గట్టు సంఘం స్వర్ణ మల్లికను జూనియర్ న్యాయవాదుల అంతా ఆదర్శంగా తీసుకొవాలని జిల్లా జడ్జి ప్రేమలత సూచించారు. బుధవారం గద్వాల బార్ అసోసియేషన్ లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన సీనియర్ న్యాయవాది గ ట్టు సంఘం సురేష్ కుమార్తె గట్టు సంఘం స్వర్ణమల్లికను బార్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్,జూనియర్ న్యాయవాదులు ఘ నంగా శాలువాలు పూలమాలతో సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా జ డ్జి ప్రేమలత మాట్లాడుతూ గద్వాల బార్ కు చెందిన సీనియర్ న్యాయవాది గట్టు సురేష్ కుమార్తె స్వర్ణ మల్లిక జడ్జిగా ఎంపిక కావడం పట్ల అభినందించారు. జూనియర్ న్యాయవాదులు కూడా గట్టు సంఘం స్వర్ణ మల్లిక ను ఆదర్శంగా తీసుకొని జడ్జిలుగా ఎంపిక కావడానికి ప్రయత్నించాలని కోరారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నాన్న ప్రో త్సాహంతోనే జడ్జిగా ఎంపిక అవగలిగానని గట్టు సంఘం స్వర్ణ మల్లిక తెలిపారు.
నా కలల సహకారానికి నాన్న తోడ్పాటు ఎంతో ఉందన్నా రు. అమ్మానాన్నలతో పాటు సోదరుడు న్యాయవాది సంతోష్, యూకే( ఇం గ్లాండ్ )లో ఉన్న చెల్లి గట్టు సంగం శివ జ్యో తి ల ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. జడ్జికి ఉండాల్సిన లక్షణాలు గౌరవం గురించి నాన్న నాకు తరచూ చెప్పేవాడని తెలిపారు దీంతో జడ్జి కావాలని కోరిక నాలో బలంగా నాటుకుందని దాన్ని సాధించే దిశగా అడుగులకు ముందుకు వేస్తూ లక్ష్యాన్ని చేరుకు న్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు జడ్జి ఎస్ రవికుమార్, ప్రిన్సిపల్ సీ నియర్ సివిల్ జడ్జ్ వి రవికుమార్, అడిషన ల్ సీనియర్ సివిల్ జడ్జి టి లక్ష్మి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నేరెళ్ల వెంకట హైమ పూజిత, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఉ దయ నాయక్,న్యాయవాదులు మనోహర్ ఇస్మాయిల్ మధుబాబు రాధాకృష్ణారెడ్డి జై సింహా రెడ్డి ఖాజా మోహీనోద్దీన్, రఘురాం రెడ్డి, ఇస్మాయిల్, గంగాధర్, శ్రీకాంత్, సుధాకర్, ఆనంద్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.