calender_icon.png 25 July, 2025 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాలక్ష్మి సంబురం - ఆర్టీసీ సిబ్బందికి సన్మానం

24-07-2025 12:24:38 AM

పెబ్బేరు జూలై 23 : మహాలక్ష్మి పథకం ద్వారా 200 కోట్ల మంది మహిళలు ఉపయోగించుకున్నందున బుధవారం ఆర్టీసీ బ స్టాండ్ ప్రాంగణం లో సంభరాలు నిర్వహించారు. మండల మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యం లో మహాలక్ష్మి పథకం సంబరాలను నిర్వహించారు. విధుల్లో పలువురు ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లకు శాలువాలతో సత్కరించారు.

మాజీ సర్పంచ్ సుశీల, సామాజిక కార్యకర్త మం ద అక్కమ్మ, మార్కెట్ యార్డ్ ఛైర్ పర్సన్ ప్ర మోదిని రెడ్డి, మాజీ ఎంపీపీ పద్మావతమ్మ లు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉ చిత బస్సు ప్రయాణం లో తెలంగాణ రాష్ట్ర మహిళలు 200 కోట్ల సార్లు ప్రయాణం నిర్వహించటం ప్రభుత్వ ఘన విజయంగా అభివర్ణించారు.

ఈ కార్యక్రమంలో మహిళా సంఘం అధ్యక్షురాలు ఇందిర, పట్టణ అధ్యక్షురాలు శ్యామలమ్మ, చిట్టెమ్మ, చంద్రకళ, జమ్మలమ్మ, గౌతమి, జానమ్మ, ఉత్తరమ్మ తదితరులు పాల్గొన్నారు.