23-07-2025 12:43:21 AM
న్యూఢిల్లీ, జూలై 22: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రెండో రోజైన మంగళ వారం వాయిదాలతో ఏ మాత్రం ముందు కు సాగలేదు. ఉదయం ఉభయ సభలు సమావేశం కాగానే రగడ మొదలైంది. సమావేశాలకు ముందు ఇండియా కూటమి ఎంపీలంతా సమావేశం నిర్వహించుకున్నారు. అనంతరం ప్రారంభమైన ఉభయసభల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తడంతో మధ్యా హ్నం 12 గంటలకు వరకు ఉభయ సభలను వాయిదా వేశారు.
మధ్యాహ్నం 12 గంటల తర్వాత లోక్‌సభ, రాజ్యసభ తిరిగి సమావేశం అయ్యాయి. క్వశ్చన్ అవర్, జీరో అవర్ నిర్వహించాలని ప్రతిపక్ష ఎంపీలు ఉభయసభల్లో నినాదాలు చేయడంతో ఉభయస భలను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. తిరిగి 2 గంటలకు సమావేశం అయినపుడు కూడా ప్రతిపక్ష ఎంపీలు తమ నిరసనలతో హోరెత్తించడంతో రాజ్యసభను బుధవారం ఉదయం 11 గంటలకు వాయి దా వేస్తున్నట్టు ప్రకటించారు.
బీహార్ ఓటర్ల జాబితా విషయంలో సభ్యులు నిరసనలు హోరెత్తించడంతో లోక్‌సభను బుధవారానికి వాయిదా వేశారు. ఈ ఆంశం మీ ద ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తన పదవికి రాజీనామా చేయడంతో డిప్యూ టీ చైర్మన్ హరివంశ్ సింగ్ ఆధ్వర్యంలో రా జ్యసభ కార్యకలాపాలు కొనసాగాయి.
ప్రతిపక్ష ఎంపీల నిరసన
ప్రతిపక్ష ఎంపీలు బీహార్ ఓటర్ల జాబితా గురించి పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు. ఇండియా కూటమి ఎంపీలంతా ప్లకార్డులు చేతబట్టుకుని ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనలో ఎంపీలు అఖిలేష్ యాదవ్, కనిమొళి, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు పాల్గొన్నారు.