calender_icon.png 23 July, 2025 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నడ్డాతో రాంచందర్‌రావు భేటీ

23-07-2025 12:40:52 AM

  1. పలువురు మంత్రులు, పార్టీ ముఖ్యులతో సమావేశం
  2. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై వివరణ

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఢిల్లీ వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు తన రెండు రోజుల పర్యటనను విజయవంతంగా ముగించారు. ఈ పర్యటనలో పార్టీ జాతీయ నాయకత్వాన్ని కలిసి పార్టీని రాష్ర్టంలో బలోపేతం చేయడంపై కీలకంగా చర్చించారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, పలువురు నేతల వల్ల కలుగుతున్న ఇబ్బందులను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దృష్టికి తీసుకుపోయారు.

బండి సంజయ్, ఈటల రాజేందర్ వ్యవహారంపైనా ఆయన పార్టీ జాతీయ నేతల దృష్టికి తీసుకుపోయారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్, జాతీయ సహ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) శివప్రకాష్ జీ, జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ తెలంగాణ రాష్ర్ట ఇన్‌ఛార్జి సునీల్ బన్సల్, జాతీయ కార్యదర్శి అర్వింద్ మీనన్‌తో సమావేశమయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వ్యూహాలపై చర్చించినట్టు సమాచారం.

కేంద్రమంత్రులతో వరుస భేటీలు

ఢిల్లీలో కేంద్ర మంత్రులతో రాంచందర్ రావు సమావేశమయ్యారు. కేంద్ర మ ంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ,  ని ర్మలా సీతారామన్, జి. కిషన్ రెడ్డి, బండి స ంజయ్ కుమార్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలో బీజేపీని బ లోపేతం చేయడం, కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన వైఫల్యాలను ప్రజల్లో బహిర్గతం చే యడంతో పాటు ప్రజాసమస్యలపై పోరాటా లు చేసేలా స్పష్టమైన మార్గదర్శనం లభించింది. రెండు రో జుల ఢిల్లీ పర్యటన ముగించుకున్న  రాంచందర్ రావు రాష్ర్ట అధికార ప్రతినిధి ఎన్వీ సు భాష్‌తో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు.