03-01-2026 12:20:30 AM
చైర్మన్‌పై డైరెక్టర్ల అవిశ్వాస తీర్మానం
వేతనాలు, బకాయిలు చెల్లించడంలో విఫలమని ఆరోపణ
5న మదర్ డెయిరీ పాలకవర్గం సమావేశం
ఎల్బీనగర్, జనవరి 2: నల్లగొండ-, రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం(నార్మూల్, మదర్ డెయిరీ) పాలక వర్గంలో ముసలం మొదలైంది. చైర్మన్ పై స్వపక్షానికి చెందిన డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం నోటీసు మదర్ డైయిరీ ఎండీకి అందజేశారు. చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి ముందే రాజీ నామా చేయాలని, లేకుంటే అవిశ్వాస తీర్మానం ఎదుర్కొవాలని సవాల్ చేశారు. చైర్మన్ మధుసూదన్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, డైరెక్టర్లతో సంప్రదించడం లేదని, మదర్ డైయిరీ సంస్థను కాపాడటానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
పాడి రైతులకు పాల బిల్లు లు, ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని దయనీయస్థితిలో ఉన్నట్లు డైరెక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించక పోవడంతో పాడి రైతులు పాలను ఇతర డైయిరీలకు పోస్తుండడంతో సేకరణ తగ్గిపోయిందని, దీనిపై చర్చించేందుకు డిసెంబరు 31న సమావేశం నిర్వహించాలని 30న నోటీసు ఇచ్చినా చైర్మన్ స్పందించలేదన్నారు. దీంతో చైర్మన్ మధుసూదన్ రెడ్డిని పదవి నుంచి దించడమే లక్ష్యంగా డైరెక్టర్లు సిద్ధమవుతున్నారు. చైర్మన్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఈ నెల 5న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ 11 మంది డైరెక్టర్లు మదర్ డైయిరీ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకు లేఖ అందజేశారు.
చైర్మన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ
నల్లగొండ-, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం(నార్మూల్) చైర్మన్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అధిష్టించారు. చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తు న్నారని ఆయనపై కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ప్యానెల్ డైరెక్టర్లే అవిశ్వాస తీర్మానానికి సిద్ధపడ్డారు. రైతులకు బకాయిలు చెల్లిం చడం లో, డెయిరీని సమస్యల నుంచి గట్టెక్కించడంలో చైర్మన్ విఫలమయ్యాడని డైరెక్టర్లు ఆరోపించారు. అప్పుల నుంచి డెయిరీని రక్షించుకోవడానికి ఎన్డీడీబీతో ఒప్పందం చేసుకుంటామని ప్రకటించిన చైర్మన్, ఒప్పం దం చేసుకోవడంలో విఫలమయ్యాడన్నారు. రైతులకు బకాయిలు చెల్లించకకపో వడంతో పాలు పోయడం తగ్గించారని డైరెక్టర్లు ఆరోపిస్తున్నారు. గతంలో అప్పులు చెల్లించడానికి సంస్థ చిరాస్తులను పరిస్థితి ఇలాగే కొనసాగి తే డెయిరీ మనుగడ కష్టమని భావిస్తున్నారు.