calender_icon.png 29 September, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్ జెడ్పీ వైపు సత్తు మల్లేశం చూపు

29-09-2025 12:00:00 AM

చొప్పదండి నుండి జడ్పిటీసీగా పోటీ చేసేందుకు సిద్ధం

కరీంనగర్, సెప్టెంబరు 28 (విజయ బ్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన కరీంనగర్ గ్రం థాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం చూపు కరీంనగర్ జెడ్పీపై పడింది. తెలుగు యువత అధ్యక్షునిగా పనిచేసి రేవంత్ రెడ్డికి సన్నిహితునిగా ఉంటూ వస్తూ ఆయనవెంటే కాంగ్రెస్లో చేరి వివిధ పదవులను అలంకరించి ప్రస్తుతం గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఉన్న సత్తు మల్లేశం కరీంనగర్ జిల్లా చొప్పదండి జడ్పీటీసీ స్థానానికి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. మొదటిసారి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవి బీసీ జనరలకు అయింది.

దీంతో ఆయన జెడ్పీ చైర్మన్ పదవిపై దృష్టిసారిం చి, బీసీ జనరల్ స్థానమైన చొప్పదండి నుంచి గెలిచి జడ్పీ చైర్మన్ పదవి చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో 15 జడ్పిటీసీ స్థానాలు ఉన్నాయి. సగానికిపైగా సీట్లు సాధించే పార్టీ జడ్పీపై జెండా ఎగురవేయవచ్చు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో మెజార్టీ స్థానాలు దక్కుతాయన్న ఆశలో ఆశావహులు ఉన్నారు.

తెలంగాణ రా ష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలుత జిల్లా పరిషత్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఉండేది. అప్పుడు బీఆర్‌ఎస్ నుంచి తుల ఉమ చైర్ పర్సన్ గా పనిచేశారు. తదనంతరం జిల్లాల విభజన తర్వాత జిల్లా పరిషత్ లు కూడా జిల్లాల వారీగా ఏర్పడ్డాయి. ఆ క్రమంలో జరిగిన ఎన్నికల్లో ఎస్సీ మహిళకు రిజ ర్వు కావడంతో బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన కనమల్ల విజయ చైర్ పర్సన్ గా పనిచేశారు.

గత 2019లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఒక్క జడ్పిటీసీ స్థానం కూడా దక్కలేదు. తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో ఒకరిద్దరు మాత్రమే కాంగ్రెస్లో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లాలో బలం పుంజుకుంది. జిల్లాలోని మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంలు ప్రాతినిధ్యం వహిస్తు న్నారు.

బీఆర్‌ఎస్ నుంచి కరీంనగర్, హుజూరాబాద్ ఎమ్మెల్యేలుగా గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డిలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్ర భాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి, సైదాపూర్ మండలాలు కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్నాయి. ఈ రెండు జడ్పీటీసీ స్నానాలతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నచోట ఇంచార్జిలుగా పనిచేస్తున్న నేతలున్నచోట మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునే దిశగా నేతలు పనిచేయాల్సి ఉంటుంది.

కరీంనగర్ జెడ్పీపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్న ఆలోచనలో పార్టీ ఉంది. ప్రస్తుతం సత్తు మల్లేశం పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. ఎన్నికలనాటికి మరికొందరి పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉంది.