calender_icon.png 27 October, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓవైపు హీరోగా..మరోవైపు సామాజిక సేవలు

27-10-2025 12:00:00 AM

 ఏటూరునాగారం ఏజెన్సీలో సంజోష్ ఫౌండేషన్ ద్వారా పేదలకు ఉచిత కంటి పొర చికిత్స

అమోఘం హీరో సంజోష్ సేవలు

ఏటూరునాగారం,అక్టోబరు26(విజయక్రాంతి):ఇతరులకు సేవ చేయాలంటే మనసుండాలి. ముఖ్యంగా సమాజం పట్ల ప్రేమ ఉండాలి. పనిమీద అంకితభావం ఉండాలి. మూడు పదుల వయసులోనే సమాజం పట్ల పెద్ద మనసు చేసుకున్న అరుదైన వ్యక్తి సంజోష్ సినిమా ఇండస్ట్రీలో హీరోగా చాలా సినిమాల్లో నటించారు తన సినిమాలు ఆడియన్స్ మంచి మేసేజ్ ని ఇచ్చాయి ఈ సమాజానికి నా వంతుగా ఇంకా ఏదో ఒకటి చేయాలని ఆలోచనతో సంజోష్ తన పేరుతోనే తాను‘సంజోష్ ఫౌండేషన్‘స్థాపించారు వందల మంది అభాగ్యులకు సంజోష్ ఫౌండేషన్ అండగా నిలిచింది 

ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతంలో కంటి పొర చికిత్స 

 పచ్చని ప్రకృతి మధ్య ఉండే అందమైన ప్రదేశం అయిన ఏటూరునాగారంలో సంజోష్ ఫౌండేషన్ ద్వారా పేదలకు ఉచిత కంటి పోర చికిత్స శిబిరం శంకర నేత్రాలయ మేసు హైదరాబాద్ వారి సహాయంతో నిర్వహించారు. ఈ శిబిరంలో చికిత్స చేయించు కోవడానికి దూర ప్రాంతాల నుంచి వచ్చి ఉచిత కంటి పరిక్షలు చేసుకుంటున్నారు కంటి పరీక్ష చేసుకుని సమస్య ఉంటే సర్జరీలు చేసి కంటి సమస్యలను నయం చేస్తున్నారు కంటి పరిక్ష కేంద్రాల వద్ద వచ్చిన పేసెంటులకు సినీ నటుడు హీరో సంజోష్ పలు సూచనలు ఇచ్చి దిక్కు మొక్కూలేని వారికి అపత్బంధవుడుగా వారి జీవితంలో నిలుస్తున్నారు.

ఈ కార్యక్రమానికి ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ శనివారం వచ్చి కంటి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించి అక్కడ వైద్యులకు పలు సూచనలు ఇచ్చారు సంజోష్ చేస్తున్న సేవాలను చూసి సంజోష్ ను అభినందించారు కంటి చూపు పొర చికిత్స పరీక్షల కోసం అధిక సంఖ్యలో పరీక్షలు చేయించుకున్నారని, వారిలో 110 మంది శస్త్ర చికిత్సకు అర్హులు అయ్యారని అందులో 25మందికి కంటి పోర చికిత్స సర్జరీలు చేశామని సంజోష్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సినీ నటుడు సంజోష్ తెలిపారు.