calender_icon.png 9 August, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంను కలిసిన జిల్లా కాంగ్రెస్ నేతలు

09-08-2025 01:29:56 AM

ఆదిలాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మె ల్సీ, నేతలు కలిశారు.  శుక్రవారం ఢిల్లీలోని తుగ్లక్‌రోడ్‌లోగల అధికార నివాసంలో సీఎంను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆడే గజేంద్ర, మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి తదితరులు సీఎంను  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని పార్టీ స్థితిగతులపై, పలు సమస్యలు, అభివృద్ధి పనులపై సీఎంతో నేతలు చర్చించారు.