22-12-2025 02:47:12 AM
కడ్తాల, డిసెంబర్ 21(విజయ క్రాంతి): ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కు కృషి చేస్తేనే గుర్తింపు వస్తుందని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, వాకాటి శ్రీహరి, పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కిగౌడ్‌లో అన్నారు. ఆదివారం హైదరాబాదు లోని మంత్రుల నివాసంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పాలకూర్ల రవికాంత్ గౌడ్ తన సోదరుడు కరుణాకర్ గౌడ్, వార్డు సభ్యుడు ఈ ర్లపల్లి దీపక్, యూత్ కాంగ్రెస్ నాయకుడు మహేష్ తో మర్యాదపూర్వకంగా కలిశారు.
నూతనంగా ఎన్నికైన సర్పంచిని ఈ సందర్భంగా వారు శాలువాతో సత్కరించి అభినందించారు. రాజకీ యాలకు తొలిమెట్టు సర్పంచ్ పదవేనని... తామంతా అక్కడి నుంచి వచ్చిన వారిమే అ న్నారు. రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షే మ పథకాలను అర్హులకుందేలా చేసి ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దాలని వారు కోరారు.