22-12-2025 02:42:16 AM
మేడిపల్లి,డిసెంబర్ 21 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని చెంగిచెర్ల పెద్దమ్మ గుడి దగ్గర బోడుప్పల్ ఈస్ట్ శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో వనభోజనం మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం చెంగిచెర్ల శివారు లోని పెద్దమ్మ తల్లి ఆలయానికి సంఘం సభ్యులు, కుటుంబ సమేతంగా తరలి వెళ్లి పెద్దమ్మ సన్నిధిలో సంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం పచ్చని ప్రకృతి ఒడిలో సామూహిక వన భోజనాలు చేశారు. ఈ సందర్భంగా ఆటలు పాటలు ఉత్సాహంగా గడిపారు. సంఘ సభ్యుల మధ్య ఐక్యతను పెంచడంతోపాటు మానసిక ఉల్లాసం కోసం ఇటువంటి వనభోజన కార్యక్రమాలు ఎంతో దోహదపడుతాయని, సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమం వల్ల సభ్యులందరిలో నూతనోత్తేజం వచ్చిందని శ్రీకృష్ణ యాదవ సంఘం ప్రతినిధులు తెలిపారు. ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిం చడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్, ఈస్ట్ బోడుప్పల్ యాదవ సంఘం సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.