03-11-2025 02:56:26 AM
వ్యవహరించడమేనా హైడ్రా గొప్పతనం
రాజేంద్రనగర్, నవంబర్ 2 (విజయక్రాంతి): హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాల వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినడమే కాకుండా ఎంతో మంది ఎన్నో ఏళ్లుగా కష్టపడి సంపాదించి కట్టుకున్న ఇళ్లను కులగొట్టి పేద ప్రజల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు ఆరోపించారు.
ఆదివారం నార్సింగ్ లోని మూసినది పై నిర్మిస్తున్న అక్రమ భవనాలను బీఆర్‌ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ పీ.కార్తీక్ రెడ్డి,ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి,రాజశేఖర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తదితరులు పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలపట్ల ఒకలా, ధనవంతులు పట్ల ఒకేలాగ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరుస్తుందని ఆరోపించారు. హైడ్రా పేదవారి ఇళ్లను కులగోడుతూ, మూసీ నదిపై నిర్మిస్తున్నాన భారీ భవనాల జోలికి వెళ్లకుండా ఉండడం పట్ల ప్రభుత్వ వైఖరి ఏమిటో ఇట్టే అర్థమవుతుందన్నారు.
ఇది కేవలం పేదవారి ఇల్లు కూలగొట్టి పెద్దవాల నుండి డబ్బులు దండుకోవడానికి రేవంత్ రెడ్డి హైడ్రాను తెచ్చారని ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరచాకాలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా గెలిచేందుకు ప్రజలకు తప్పుడు హామీలను ఇస్తున్నారని ఆరోపించారు.