calender_icon.png 4 November, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్దతు ధర చెల్లించి రైతుల పత్తి కొనుగోలు చేయాలి

03-11-2025 08:26:35 PM

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..

లక్షెట్టిపేట (విజయక్రాంతి): పత్తికి మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుండి పత్తిని కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని వెంకటేశ్వర కాటన్ మిల్ లో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ, జిల్లా మార్కెటింగ్ అధికారి షాహబోద్దీన్, సి.సి.ఐ అధికారులు, మండల తహసిల్దార్ దిలీప్ కుమార్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం సిసిఐ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుండి పత్తి కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.

2025- 26 సంవత్సరంలో మద్దతు ధర క్రింద సి.సి.ఐ. కు పత్తి విక్రయించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన కపాస్ కిసాన్ యాప్ లో రైతులు తమ వివరాలు నమోదు చేసుకుని, పత్తి విక్రయానికి స్లాట్ బుక్ చేసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈసారి ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 స్థాయిలలో స్లాట్ బుకింగ్ చేయడం జరుగుతుందని, ప్రతి స్థాయిలో 75 శాతం స్లాట్ లు బుక్ అయిన తర్వాత స్థాయిలో బుకింగ్ ఓపెన్ అవుతుందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు నిబంధనల ప్రకారం పత్తిలో 8 నుండి 12 తేమ శాతం, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని రైతుల వద్ద నుండి పత్తి కొనుగోలు చేయాలని సూచించారు.

ఆధార్ నంబర్ కు అనుసంధానం చేయబడిన బ్యాంకు ఖాతాలో మాత్రమే చెల్లింపులు జరుగుతాయని, ఆధార్ కార్డులో ఫోటో కలిగి ఉన్న రైతు మాత్రమే తక్పట్టిలో ఫోటో దిగవలసి ఉంటుందని తెలిపారు. క్రాప్ బుకింగ్ లో నమోదు చేసిన రైతుల నుండి కొనుగోలు చేయడం జరుగుతుందని, మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి సమన్వయంతో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పత్తి కొనుగోలుతో పాటు వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లాలో చేపట్టడం జరుగుతుందని, రైతులు నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్ చంద్, వైస్ చైర్మన్ ఆరీఫ్ సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.