03-11-2025 08:48:08 PM
కుభీర్ (విజయక్రాంతి): మండలంలోని ఫార్డి(బి) గ్రామానికి చెందిన ర్యాపన్వార్ రుక్మ బాయి(47) అనే మహిళ సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. రుక్మ బాయి ఆదివారం అర్దరాత్రి సమయంలో ఇంట్లో ఉన్న గుర్తు తెలియని పురుగుల మందు తాగి ఆపస్మరక స్థితిలో పడి ఉండడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే బైంసా ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె పరిస్థితి విషమించడంతో మార్గమధ్యలో మృతి చెందింది.
మృతురాలికి ముగ్గురు కూతుళ్లు ఒక్క కుమారుడు(దివ్యాంగుడు) ఉన్నారు. కుమారుడు తరచూ అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆర్థిక ఇబ్బందుల వలన ఆస్పత్రులకు తీసుకెళ్ళలేకపోవడం పట్ల మనస్థాపకుని గురైన రుక్మాబాయి జీవితంపై విరక్తి చెంది ఆత్మహాత్య చేసుకున్నట్లు మృతురాలి తమ్ముడు ప్రకాష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై లక్ష్మణ్ వివరించారు.