03-11-2025 08:50:23 PM
ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన రాష్ట్ర రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు సోమశేఖర్ రావు..
కామారెడ్డి (విజయక్రాంతి): బాన్సువాడ ఎమ్మెల్యే పరిగి శ్రీనివాస్ రెడ్డిపై అనర్హత వేటువేయాలని జాతీయ రైతు సంఘాల సమైక్య అధ్యక్షుడు సోమశేఖర రావు సోమవారం ఎన్నికల ప్రధాన కమిషనర్ కు వినతిపత్రాన్ని అందజేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్191 (1) (ఏ) ప్రకారం అనర్హతకు గురైన నేపథ్యంలో ఈ అంశంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషన్ ను కోరారు.