03-11-2025 08:30:21 PM
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ దేవేందర్
కామారెడ్డి (విజయక్రాంతి): ఉద్యోగులకు పదవి విరమణ తప్పనిసరి గా ఉంటుందని తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ దేవేందర్ అన్నారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి పదవి విరమణ కార్యక్రమం సందర్భంగా ఘనంగా సన్మానించారు. శ్రీనివాస్ రెడ్డి తల్లి అనారోగ్యంతో ఉండడంతో నాలుగు నెలల ముందుగానే పదవి విరమణ తీసుకున్నారని ఆయన తెలిపారు.
32 సంవత్సరాల పాటు ఎలాంటి రీమార్క్ లేకుండా సేవలందించిన శ్రీనివాస్ రెడ్డిని ఉద్యోగులు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందరితో కలుపుగోలుగా చిరునవ్వుతో శ్రీనివాస్ రెడ్డి సేవలందించారన్నారు. ఉన్నతాధికారిగా కాకుండా ప్రజలకు కావలసిన సేవలను అందించేందుకే మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి తనతో కలిసి పనిచేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా కలెక్టర్ లు మదన్మోహన్, విక్టర్, జెడ్పిసిఈఓ చందర్ నాయక్, జిల్లా గెజిటెడ్ అధికారులు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.