03-11-2025 08:05:45 PM
భద్రాచలం (విజయక్రాంతి): రాష్ట్ర బీసీ సాధన సమితి పిలుపు మేరకు సోమవారం భద్రాచలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో బీసీ జేఏసీ నేతృత్వంలో బీసీ నాయకులు, కార్యకర్తలు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మ్రినాలి శ్రేష్టకి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌తో వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వాలు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బొలిశెట్టి రంగారావు, ప్రధాన కార్యదర్శి బండారు నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు అనుగోజు నరసింహ చారి, సహాయ కార్యదర్శి మేకల మల్లు బాబు యాదవ్, సహకోశాధికారి కోపనాతి శాంతారావు, పద్మశాలి సంఘం అధ్యక్షుడు అనుమల్ల గంగాధర్, గాళ్ల తెలకుల సంఘం అధ్యక్షుడు కొమ్మనాపల్లి ఆదినారాయణ, దేవాంగుల సంఘం అధ్యక్షుడు ఏ. కుల రామచంద్రరావు, ఎస్సీ సంఘం నాయకులు ముద్దా పిచ్చయ్య, కోటా కిషోర్, బోక్క రాంబాబు, దాసరి శేఖర్, ఆదివాసి సంఘం నాయకులు రవ్వ భద్రమ్మ, ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.