03-11-2025 08:36:35 PM
ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు..
చిట్యాల (విజయక్రాంతి): నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలోని జాతీయ రహదారి 65పై ఉన్న రైల్వే బ్రిడ్జి వద్ద తరచుగా ట్రాఫిక్ జామ్ అవుతున్నందున దానికి గల కారణాలను తెలుసుకునేందుకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ సోమవారం స్వయంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షపు నీరు ఫ్లోటింగ్ ఎక్కువ కావడంతో వరద నీరు రైల్వే బ్రిడ్జి కింద లోతట్టుగా ఉండటం వల్ల నీరు బయటకి వెళ్లకపోవడం చేత వరద నీరు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ కు కారణం అవుతుందని, ఈ ట్రాఫిక్ జామ్ వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వర్షపు నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు వెళ్లిపోయేలా శాశ్వత చర్యలు తీసుకొని జాతీయ రహదారిపై మళ్ళీ ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత ఎన్ హెచ్ఎఐ, మున్సిపల్, రెవెన్యూ అధికారులకు సూచించారు. ఆయనతో పాటు నల్గొండ డి.ఎస్.పి శివరాంరెడ్డి, నార్కట్ పల్లి సిఐ నాగరాజు, ఎస్ ఐ మామిడి రవికుమార్ లు ఉన్నారు.