calender_icon.png 4 November, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రత్యేక లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి

03-11-2025 08:12:49 PM

జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్ పర్సన్ వి.బి.నిర్మలా గీతాంబ

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాలానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్ లో నవంబర్ 15 తేదీన ప్రత్యేక లోక్ అదాలత్ ను  నిర్వహించనున్నారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ వి. బి. నిర్మల గీతాంబ తెలియజేశారు. వరంగల్ న్యాయ సేవా సదనం బిల్డింగ్ లో రెండు వేర్వేరు సమావేశాలను నిర్వహించడం జరిగింది.

మొదటగా ఇన్సూరెన్స్ సంబంధ, చిట్ ఫండ్ కంపెనీ, బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత న్యాయమూర్తులు, పోలీసు ఉన్నతాధికారులు పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ మాట్లాడుతూ... ప్రత్యేక లోక్ అదాలత్ లో రాజీపడదగు క్రిమినల్, సివిల్, వివాహకుటుంబ తగాదా కేసులు, మోటార్ వెహికల్ యాక్ట్, బ్యాంకు, చిట్ ఫండ్, ఎక్సైజ్ కేసులు, ఎలక్ట్రిసిటీ సంబంధ కేసులను రాజీ పడదగు ఇతర కేసులు పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.