03-11-2025 08:56:19 PM
రాచకొండ సిపి సుధీర్ బాబు..
మేడిపల్లి (విజయక్రాంతి): నూతన రాచకొండ కమిషనరేట్ కార్యాలయం నిర్మాణ పనుల్లో నాణ్యత పాటిస్తూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు రాచకొండ సీపీ సుధీర్ బాబు సూచించారు. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం సిపిఆర్ఐ రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న రాచకొండ కమిషనర్ కార్యాలయ నిర్మాణ పనులను సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులతో సిపి సుధీర్ బాబు సోమవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా కాంట్రాక్టర్లతో అధికారులతో సమావేశమై సంబంధిత అధికారులు నిర్మాణ నమూనా మ్యాప్ను వివరించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్లకు సీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ పోలీస్ రాచకొండ, డిసిపి క్రైమ్స్ రాచకొండ, డిసిపి ట్రాఫిక్ వన్ రాచకొండ, డిసిపి హెడ్ క్వార్టర్స్ రాచకొండ, డిసిపి అడ్మిన్, ఎసిపి మల్కాజిగిరి, ఎసిపి ట్రాఫిక్, మేడిపల్లి సీఐ తదితరులు పాల్గొన్నారు.