27-08-2025 03:14:21 AM
జగన్ క్విడ్ ప్రోకో కేసు
హైదరాబాద్, ఆగస్టు 26(విజయక్రాంతి)ః ప్రముఖ రియ ల్ ఎస్టేట్ కంపెనీ వాన్‌పిక్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమార్కుల కేసులో సీబీఐ చార్జ్‌షీట్ నుంచి తమ సంస్థ పేరును తొలగించాలంటూ వాన్‌పిక్ వేసిన పిటిషన్‌ను మంగళవారం తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. గతంలో వాన్‌పిక్ పేరును సీబీఐ తన చార్జ్‌షీట్‌లో చేర్చగా.. ప్రస్తుతం ఈ కేసు నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణలో ఉంది. అయితే 2022, జులైలో వాన్‌పిక్ ప్రాజెక్ట్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది.
ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సీబీఐ సవాల్ చేసింది. తమ వాదనలను పరిగణన లోకి తీసుకోకుండా వాన్‌పిక్ ప్రాజెక్ట్ పిటిషన్‌ను అనుమతించారని, సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు మరోసారి పిటిషన్‌ను విచారించాలని హైకోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలో వాన్‌పిక్ ప్రాజెక్టుపై వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది.