calender_icon.png 27 August, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఊర్లకు ఊర్లే.. బయలెల్లుతాండ్లు!

27-08-2025 12:55:10 AM

-యూరియా కోసం దండయాత్ర 

-తెల్లవారక ముందే పడిగాపులు 

-మరిపెడ, ఇనుగుర్తిలో రాస్తారోకో

మహబూబాబాద్, ఆగస్టు 26 (విజయ క్రాంతి): యూరియా కోసం ఊర్లకు ఊర్లే తరలుతున్నాయి. ఊరిలో ఉండే రైతులంతా కలిసికట్టుగా తెల్లవారుజామునే పొలానికి బదులు యూరియా కోసం మండల కేంద్రా నికి తరలి వస్తున్నారు. రైతు వేదికలు, సొసై టీ ఎరువుల విక్రయ కేంద్రాల వద్దకు చేరు కొని ఒక్క యూరియా బస్తా కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు.

మంగళవారం మ హబూబాబాద్ జిల్లా కేసముద్రం, గూడూ రు, కొత్తగూడ, ఇనుగుర్తి మండల పరిధి లోని కల్వల, కోమటిపల్లి, చిన్న ముప్పారం, చిన్ననాగారం, పాత తండా, బేరువాడ, కేస ముద్రం, కోరుకొండపల్లి, మహమూద్ ప ట్నం, బుక్య రామ్ తండా, తారా సింగ్ తం డా, పడమటి తండా, తావూరియా తండా, అమీనాపురం తదితర గ్రామాల నుండి వం దలాది మంది రైతులు వేకువ జామునే కొత్త గూడ, పొగళ్లపల్లి, గూడూరు, కేసముద్రం సొసైటీ, ఇనుగుర్తి రైతు వేదిక వద్దకు తరలి వచ్చారు.

గంటలపాటు క్యూ లో నిరీక్షిం చలేక కొంతసేపు చెప్పులు, పట్టా పాస్ పుస్త కాలు, చివరకు రాళ్లు క్యూలో పెట్టారు. పెద్ద ఎత్తున రైతులు యూరియా కోసం తరలివ చ్చిన విషయం తెలుసుకున్న పోలీసులు వెం టనే అక్కడికి వెళ్లి రైతులను గొడవ పడ కుండా చూశారు. మరిపెడలో జాతీయ రహ దారిపై మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ఆధ్వ ర్యంలో రాస్తారోకో నిర్వహించారు.

ఇను గుర్తిలో రైతులు ప్రధాన రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. ఇన్ని రోజుల నుంచి యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున రైతులు ఆందో ళనకు దిగడంతో వ్యవసాయ శాఖ అధికా రులు  అక్కడకు చేరుకొని వచ్చిన యూ రి యా బస్తాలను వరుస క్రమంలో ఒక్కొ క్కరికి ఒకటి చొప్పున పంపిణీ చేశారు. మిగి లిన వారికి టోకెన్లు జారీ చేయగా, మరి కొందరి ఆధార్ కార్డులను వరుస క్రమంలో పెట్టి యూరియా రాగానే సమాచారం ఇచ్చి పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. దీనితో రైతులు శాంతించారు.

రైతుల ఆందోళన 

గుమ్మడిదల: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో యూరియా కోసం మంగళవారం రైతులు ఆందోళన చేపట్టారు. జిన్నారం కేంద్రంలో యూరియా కోసం మండలంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు భారీ ఎత్తున తరలివచ్చారు. సొసైటీ, ఫర్టిలైజర్ దుకాణాలకు యూరియా సర ఫరా చేయడంలో అధికారులు విఫలమ య్యారని ఆరోపిస్తూ కార్యాలయం ఆవరణ లో రైతులు ఆందోళన చేయడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మూడు రోజుల నుంచి యూరియా కోసం పడిగాపులు కాసినా కేవ లం ఒక లారీ యూరియాను పంపడంతో ఏ మూలకు సరిపోతుందని రైతులు మం డిపడ్డారు. 

టోకెన్లు ఇచ్చినా యూరియా ఇయ్యలే

దౌల్తాబాద్/హుజురాబాద్: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం నర్సం పేటలో రైతులు ఆందోళన చేశారు. టోకెన్లు ఇచ్చిన వారికి కూడా యూరియా ఇవ్వకుండా ఇష్టం వచ్చిన వారికి అమ్మడంతో ఆగ్రహించిన రైతులు జ్యోతి ఫర్టిలైజర్ ముందు ధర్నా చేశారు. వ్యవ సాయ శాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూరియా కోసం రెండు గంటల పాటు రైతులు ధర్నా, రాస్తారోకో చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను సముదా యించారు.

అయినప్పటికీ రైతులు యూరియా ఇచ్చేవ రకు కదిలే ప్రసక్తి లేదని రైతులు తేల్చి చెప్ప డంతో తొగుట సిఐ లతీఫ్ చేరుకొని రైతు లను సముదాయించినా వివనలేదు. గజ్వేల్ ఏసిపి నర్సింలు, దుబ్బాక ఏడిఏ మల్ల య్యలు చేరుకొని ధర్నా చేస్తున్న రైతులతో మాట్లాడారు. టోకెన్లు ఇచ్చిన రైతులకు రెం డు మూడు రోజుల్లో యూరియాను అం దిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.

కాగా అధిక ధరలకు యూ రియాను విక్రయించిన జ్యోతి, రోహిణి ఫర్టి లైజర్ షాపులను దుబ్బాక ఏడిఏ మల్లయ్య సీజ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఇల్లంతకుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మంగళవారం రైతులు బారులు తీరారు. క్యూ లో చెప్పులు పెట్టి టోకెన్ల కోసం తంటా లు పడ్డారు.

ఇప్పటివరకు మండలంలో ఒక ఫర్టిలైజర్ షాపులకు కూడా యూరియా సరఫరా చేయలేదు. రైతులు యూరియా కో సం ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘం వద్దకు ప్రతిరోజు వస్తు వెనుతిరిగి పో తున్నారు. వేసిన పంటలకు ఎరువులు రాష్ర్ట ప్రభుత్వం సకాలంలో పంపిణీ చేయక పోవడంతో తీవ్ర ఇబ్బందుల గురవుతు న్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.