calender_icon.png 27 August, 2025 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ

27-08-2025 03:09:03 AM

‘ఏఐఎస్‌ఈసీటీ-జెన్‌పాక్ట్ స్కిల్ బిల్డ్’ ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): ఏఐఎస్‌ఈసీటీ సంస్థ వరంగల్ సిటీ మహిళా డిగ్రీ కాలేజీ, శివాని డిగ్రీ కాలేజీలతో కలిసి ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంతో 250 మంది వెనుకబడిన విద్యార్థులకు బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో పరిశ్రమ ప్రమాణాల శిక్షణ అందించబడు తుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్, బ్యాంకింగ్, సాఫ్ట్ స్కిల్స్ శిక్షణతో పాటు, శిక్షణ అనంతరం ప్రత్యేక ప్లేస్మెంట్ సహాయం కల్పించబడుతుంది.

ఏఐఎస్‌ఈసీటీ గత రెండు దశాబ్దాలుగా గ్రామీణ మరియు వెనుకబడిన ప్రాంతాల్లో డిజిటల్ లిటరసీ, నైపుణ్యాభివృద్ధి, విద్య, ఉపాధి సృష్టి రంగాలలో పనిచేస్తూ ఇప్పటివరకు 6 లక్షల మందికి పైగా యువత జీవితాలను మార్చింది. ఈ సందర్భంగా జెన్‌ప్యాక్ట్ సీనియర్ మేనేజర్ గౌరి మహేంద్ర, ఆమె బృందం, ఏఐఎస్‌ఈసీటీ జోనల్ కోఆర్డినేటర్ విపుల్‌శర్మ, శివాని డిగ్రీ కాలేజ్ డైరెక్టర్ డాక్టర్ వి సురేష్, సిటీ మహిళా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె అమర జ్యోతి పాల్గొన్నారు.