calender_icon.png 27 August, 2025 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాదాబైనామాలకు తొలగిన అడ్డంకి

27-08-2025 01:12:14 AM

  1. క్రమబద్దీకరణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
  2.   2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు స్వీకరించిన దరఖాస్తులకు అనుమతి
  3. హైకోర్టు తీర్పుతో సమస్యల పరిష్కారమైందన్న పొంగులేటి

హైదరాబాద్, ఆగస్టు 26: తెలంగాణ రాష్ట్రంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు హైకోర్టు లైన్ క్లియర్ చేసింది. 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించేందుకు తెలంగాణ హైకో ర్టు అనుమతించింది. సాదాబైనమాల క్రమబద్ధీకరణకు 2020 అక్టోబర్ 10న రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవోపై అదే ఏడాది నవంబర్‌లో హైకోర్టు స్టే ఇచ్చింది. చట్టంలో అవకాశం లేకుండా ఎలా క్రమబద్దీకరిస్తారని ప్రశ్నిం చింది. కొత్తగా తెచ్చిన భూభారతి చట్టంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణ అంశం పొందుపరిచినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ వివరణతో సంతృప్తి చెందిన ధర్మాసనం సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అంగీకరిస్తూ విచారణను ముగించింది.

సమస్య పరిష్కారమైనట్లే..

భూభారతి చట్టం ద్వారా సాదా బైనామాల దరఖాస్తులకు పరిష్కారం చూపిస్తామని రాష్ర్ట రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.  సాదాబైనామాలపై ఉన్న స్టేను హైకోర్టు  మంగళవారం తొలగించిన నేపథ్యం లో ఆయన స్పందించారు. ఈ తీర్పు లక్షలాది మంది పేద ప్రజల కలలను సాకారం చేస్తుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సాదా బైనామాల విషయంలో గత ప్రభుత్వం పేద ప్రజలను న మ్మించి మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశా రు. ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరించారని కానీ 2020 ఆర్‌ఓఆర్ చట్టంలో ఈ దరఖాస్తుల పరిష్కారానికి మార్గం చూపించలేదని విమర్శించారు. ఫలితంగా 9.26 లక్షల దరఖాస్తులు పరిష్కారం కాకుండా పోయాయన్నాని... పలువురు హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. తమ ప్రభుత్వం నిరంతరం హైకోర్టులో కేసుకు ముగింపు లభించేలా కృషి చేసిందన్నారు.