calender_icon.png 28 August, 2025 | 8:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు

27-08-2025 03:06:38 AM

నిజామాబాద్ అధ్యక్షుడిగా విజయ్‌కుమార్

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): నిజామాబాద్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 2025 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గ ఎన్నికలు స్థానిక శ్రద్ధానంద్ గంజు నందుగల మర్చంట్ అసోసియేషన్ కార్యాలయంలో బుధవారం అధ్యక్షుడు ఆర్ జగదీశ్వర రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 2025 సంవత్సరానికి అధ్యక్షుడి గా సి విజయ్‌కుమార్ (నిషిత రాజు), ఉపాధ్యక్షుడిగా కమల్ ఈ నాని, కార్యదర్శిగా వి శ్రీనివాస రావు, జాయింట్ సెక్రటరీగా గజవాడ గణేష్‌గుప్తా, కోశాధికారిగా పడకంటి వినోద్‌కుమార్, కార్యవర్గ సభ్యులు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు హరిప్రసాద్, నర్సగౌడ్ తెలిపారు.

ఛాం బర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనేది అన్ని వ్యాపారవేత్తల సముదాయమని వారి కార్యచరణలో ఏర్పడే సమస్యలు, నూతన ప్రణాళికలు పరిష్కారణలకై ఏర్పడిన సంస్థ నిజామాబాద్ చాంబర్ ఆఫ్ కమర్షియల్ ఇండస్ట్రీ అని అన్నా రు. ఈ ఎన్నికల్లో మాజీ అధ్యక్షులు మోటూరి దయానంద్ గుప్తా, ధర్మపురి సురేందర్, భక్తవత్సల్యం, శ్యాంసుందర్ అగర్వాల్ తదితరులతో పాటు సంస్థ సభ్యులు పాల్గొన్నారు.