calender_icon.png 27 August, 2025 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న కేంద్రం

27-08-2025 03:17:32 AM

  1. రాష్ట్రపతి భవన్‌ను, రాజ్ భవన్‌ను కేంద్రం తమ జేబు సంస్థగా మార్చుకుంది
  2. మూడు నెలల్లో పరిష్కరించే బీసీ బిల్లును ఐదు నెలలైనా పరిష్కరించకుండా కేంద్రం తొక్కి పెడుతుంది
  3. బీసీ రిజర్వేషన్లను పెంచకుంటే బీహార్ ఎన్నికలలో బీజేపీ కూటమికి బీసీలే తగిన బుద్ధి చెప్తరు
  4. బీసీ రిజర్వేషన్లపై 28న బిసీ సంఘాల విస్రృత స్థాయి సమావేశం
  5. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి

ముషీరాబాద్, ఆగస్టు 26(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగంలో 42 శాతం రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం పెంచకుండా కేంద్ర ప్రభుత్వమే అడుగడుగునా అడ్డుకుంటుందని, రాష్ట్ర పతి భవన్‌ను, గవర్నర్ భవన్‌ను బిజెపి ప్రభు త్వం తమ జేబు సంస్థగా మార్చుకుంటుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కేంద్రంపై ఫైర్ అయ్యా రు. ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బిసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి ఆద్వర్యంలో ఎర్పాటు చేసిన మీడియా సమావేశం లో  జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడారు.

ఈ సందర్భం గా జాజుల మాట్లాడుతూ ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో తాము చేసిన పోరాటం ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఐదు నెలలు అవుతున్నప్పటికీ నేటి వరకు ఆ బిల్లును ఆమోదించకుండా కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పెంపును అడుగడుగున అడ్డుకుంటుందని ఆయన ఆరోపించారు.

బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతికి, బీసీల ఆర్డినెన్స్ ను గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రపతి భవన్ ను, రాజభవన్ తమ జేబు సంస్థలా వాడుకుంటుందని, రాజ్యాంగ బద్ధమైనటువంటి రాష్ట్రప తి, గవర్నర్ లను స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం తమ రాజకీయ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మోక్షం కల్పించకుండా బిజెపి తన బీసీ వ్యతిరేక వైఖరితో అడ్డుకుంటుందని ఆయన ఆరోపించారు.

నాటి మం డల్ నుండి నేటి బిసీ బిల్లు వరకు బిజేపి బీసీలను మోసం చేస్తునే ఉందన్నారు. బిజెపి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను ఆమోదించకపోతే అతి తొందరలోనే బీహార్ రాష్ట్రంలో జరి గే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి కూటమికి బీసీలే తగిన బుద్ధి చెబుతారని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. బిసి రిజర్వేషన్ల పెంపు పై భవిష్యత్ ఉద్యమంపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి ఈనెల 28 వ తేదీన హైదరాబాద్ లో బిసీ సంఘాల విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందా రం గణేష్ చారి,బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముది రాజ్, బీసీ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాంకుర్మ, సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొడుగు మహేష్ యాదవ్, బీసీ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈడిగి శ్రీనివాస్ గౌడ్, బీసీ యువజన సం ఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గూడూరు భాస్కర్ మేరు, అనిల్, జాజుల భాస్కర్ గౌడ్, మధు తదితరులు పాల్గొన్నారు.