calender_icon.png 28 August, 2025 | 8:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యావరణహితంగా గణేశ్ చతుర్థి

27-08-2025 03:11:36 AM

  1. విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ సుబ్బారావు
  2. వర్సిటీలో ఎకో గణేశుడి తయారీ పోటీలు

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): పర్యావరణానికి హానిచే యని మట్టితో తయారైన వినాయక విగ్రహాలనే పూజించి పర్యావరణహితంగా గణేశ్ చతుర్థి జరుపుకోవాలని విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ ఎం సుబ్బారావు అన్నారు. యాదా ద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్‌ముఖి గ్రామంలో ని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో మంగళవారం ఎకో గణేశుడి తయారీ పోటీలను నిర్వహించారు. ‘మట్టి గణపతిని పూజిద్దాం. పర్యావరణాన్ని కాపాడుకుందాం’ అనే నినాదంతో నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు.

విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో వర్సిటీ డైరెక్టర్ డాక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ.. పదిరోజుల పాటు జరిగే గణేశ్ చతుర్థి కో సం రసాయనాలు, పీవోపీతో తయా రు చేసిన గణపతి విగ్రహాలను వాడ టం వల్ల పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుందని తెలిపారు. మనం చేసే పండుగలు, ఉత్సవాలు, కార్యక్రమాలు ప్రజాహితంగాను, పర్యావరణ పరిరక్షణతో కూడుకున్నవిగా ఉండాలని చెప్పారు. మన చుట్టూ ఉండే ప్రకృతే మనకు కనిపించే దైవ స్వరూమని విజ్ఞాన్స్ యూనివర్సిటీ అడ్వుజర్, రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య చెప్పారు. దేవుడి పేరుతో ప్రకృతిని నాశనం చేస్తే, ఆ దేవుడు మనల్ని తప్పక శిక్షిస్తాడని అన్నారు. మట్టి గణపతి పూజిద్దామని విజ్ఞప్తి చేశారు.