27-08-2025 01:27:16 AM
నేడు వినాయక చవితి సందర్భంగా :
దశాబ్దాలుగా వినాయక చవితి పండుగ అన్ని వర్గాల వారు దేశవ్యాప్తంగా జరుపుకునే హిందువుల పర్వదినాల్లో ప్రముఖమైం ది. దేశ స్వాతంత్య్ర కాంక్షను రగిలించడం కోసం బ్రిటీష్ బానిసత్వానికి వ్యతిరేకంగా యువతను ఏకం చేసేందుకు 1893లో మహారాష్ర్ట పూణే కేంద్రంగా తొలిసారి సర్వ జనైఖ్య గణేశ్ ఉత్సవాలు జరిగాయి. ఈ వేడుకల్లో కుల ‘మతాలకు అతీతంగా అందరు పాల్గొన్నారు. మన హైదరాబాద్‌లోనూ గణేష్ ఉత్సవాలు ఒక ఆధ్యాత్మిక ఉత్సవాలుగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.
1980ల్లో భాగ్యనగర్ గణేశ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో తొలిసారి గణేశ్ ఉత్సవాన్ని ఘనం గా నిర్వహించారు. ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. వినాయక చవితి సం దర్భంగా నవరాత్రి పర్వదినాల్లో తొమ్మిది రోజులపాటు మహాగణపతిని పూజించడం జరుగు తుంది. భారతదేశంలో తరతరాలుగా వస్తున్న అద్భుతమైన ఆధ్యాత్మిక ఉత్సవం. లక్షలాది కుటుంబాల్లో సంతోషాలు, సంబురాలు తీసుకొస్తుంది.వ్యక్తుల్లో ఆధ్యాత్మికత’ సమర్పణ భావం’ దాన గుణం’ భక్తి భావాన్ని ప్రకటించడానికి వినాయక చవితి వేదికగా నిలవడం విశేషం.
ఆర్థిక విప్లవంలా..
వినాయక చవితి పండగ ఆర్థిక వ్యవస్థలో విభిన్న ఆర్థిక కార్య కలాపాలకు ఊతంగా నిలిచిందని చెప్పవచ్చు. ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి ‘ఉత్పత్తి వినియోగం’ పంపిణీ కార్యక్రమాలకు ఉద్దీపనంగా నిలిచిందనడంలో ఎలాంటి సందే హం లేదు. ప్రతిఏటా వినాయక చవితి పేరుతో దేశవ్యాప్తంగా అక్షరాలా లక్ష కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని అంచనా. వినాయక ప్రతిమల కొనుగోలు, రవాణా, సంగీతం, అన్న ప్రసాద వితరణ, వినాయక మంటపాల నిర్మా ణం, అలంకరణ కార్యక్రమాలు ఉపాధి కల్పిస్తున్నాయి.
ఆర్థిక ఉత్పత్తికి ఊతమిస్తున్న వినాయక చవితి పండుగను ‘సమ్మిళిత ఆర్థిక అభివృద్ధికి నమూనాగా పేర్కొనవచ్చు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాలకు ఉపాధి దక్కడంతో జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. వినాయక చవితి పండుగ ఎన్నో కులవృత్తులతో మనుగడ సాగిస్తున్న కుటుంబాల్లో సిరి సంపదలను తీసుకొస్తుంది. ఆయా వ్యాపారాలు చేసే వారికి ఈ సీజన్ మంచి గిరాకీ అందిస్తుంది. కొబ్బరికాయలు, రకరకాల పండ్లు, పత్రి.. ఇలా సన్నకారు రైతులకు ఆర్థిక ఆసరాగా నిలుస్తుంది.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతీ మంట పం దగ్గర హరికథలు, బుర్రకథలు, నాటకాలు, ఆర్కెస్ట్రా, కోలా టాలు, తోలుబొమ్మలాట పేరుతో సాం స్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తు న్నారు. దీనిని ప్రోత్సహించడం ద్వారా వారికి ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థికమాంధ్యం ఉచ్చులో చిక్కుకుంటున్నప్పటికీ.. మన దేశంలో అలాంటి కష్టాలు అంతగా లేక పోవడానికి ఇలాంటి పండగలు, పర్వదినాలదే కీలక పాత్ర. దాదాపు ప్రతి పండగ సందర్భంగా వేల కోట్ల వ్యాపారం జరుగడం వల్ల రకరకాల కులవృత్తులు, వ్యాపారాలు చేసుకునే వారందరికీ ఇది శుభ పరిణామం.
జాతీయ భావవ్యాప్తికి, జాతి ఐక్యతకు ప్రతీకగా నిలిచిన వినాయక చవితి ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలి. కొన్ని వేల కోట్ల రూపాయల ఆర్థిక కార్యక్రమాలకు ప్రధాన వాహికగా నిలిచిన గణేష్ విగ్రహాల తయారీ కుటుం బాలను ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరముంది. విగ్రహాల తయారీ కార్మికులకు కార్మిక మంత్రిత్వ శాఖ లేబర్ గుర్తింపు కార్డులు, ప్రమాధ భీమా ‘లైఫ్ ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించాలి. విగ్రహల తయారీలో కుమ్మరులకు ఆర్థిక ప్రోత్సాహం అందించాలి. అయితే ప్రతీ ఒక్కరు పర్యావరణానికి హానీ కలిగించని మట్టి విగ్రహాలతోనే పండుగ జరుపుకునేలా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలి.
వ్యాసక్తర్త: నేదునూరి కనకయ్య, కరీంనగర్