30-09-2025 01:57:53 AM
ప్రతి పనికి ఓ రేటు కడుతున్న రెవెన్యూ అధికారులు
మండల కార్యాలయాలకు వెళ్లాలంటే వణికిపోతున్న మండల ప్రజానీకం
పట్టించుకోనిపై అధికారులు
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 29 ( విజయ క్రాంతి): మండలంలోని ఓ గ్రామానికి చెంది న వ్యక్తి తన తండ్రి మరణాంతరం ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం మీ సేవ ద్వారా దరఖాస్తు చేశాడు. ఆ తర్వాత సదరు వ్యక్తి రెవెన్యూ అధికారులను సంప్రదించగా, అలాంటి అప్లికేషన్ ఏమీ తమ దృష్టికి రాలేదని సంబం ధిత అధికారి చెప్పినట్లు తెలుస్తోంది. మీ సేవ ఆన్లైన్ రశీదు చూపించిన తర్వాత కూడా సదరు అధికారి దరఖాస్తు దారుడిని దాదా పు గంటసేపు బుకాయించాడు.
ఆ తర్వాత వెయ్యి రూపాయలు ముక్కుపిండి వసూలు చేసి ఫ్యామిలీ సర్టిఫికెట్ చేతిలో పెట్టాడు. ఈ ఒక్క విషయం చాలు మండలంలో రెవెన్యూ అధికారుల తీరు ఎలా ఉంది తెలియజేయడానికి.రెవెన్యూ కార్యాలయాల్లో జరుగుతు న్న తంతు చూసి సాధారణ ప్రజలు అటు వైపు వెళ్ళేందుకు జంకుతున్నారు.
రాష్ట్ర ప్ర భుత్వం మాది ప్రజా ప్రభుత్వం అని, ప్రజలను పరిపాలనలో మరింత భాగస్వామ్యం తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని, ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఉంటే ప్రతి సోమవారం ప్రజావాణి లో దరఖాస్తు చేసుకుంటే క్షణాల మీద సమస్యలను వెంట నే పరిష్కరిస్తామని ఒకపక్క చెబుతుంటే, ప్రజలకు సేవ చేయాల్సిన రెవిన్యూ అధికారులు మాత్రం ప్రభుత్వంతో మాకు ఎలాం టి సంబంధం లేదు మా దారి సపరేటు అన్నట్లు.
’ మామూళ్లు’ మత్తులో నిత్యం జోగుతున్నారు.. దూర ప్రాంత గ్రామాల ప్రజలు రెవిన్యూ ఆఫీసుకు రావాలంటే తమ పనులను పక్కన పెట్టుకొని రెవెన్యూ అధికారు లపై నమ్మకంతో రెవిన్యూ ఆఫీసుకు నిత్యం వందలాదిమంది ప్రజలు తమకు అవసరమైన సర్టిఫికెట్స్ కు వస్తున్నారు. అయితే నే రుగా దరఖాస్తులను రెవెన్యూ అధికారులకు ఇవ్వకుండా మీసేవ పోర్టల్ నుండి దరఖాస్తులను ఎన్నో ప్రయాసలకు,
గంటలకొద్దీ మీ సేవలో తమ విలువైన సమయాన్ని వెచ్చిం చి దరఖాస్తులను అప్లోడ్ చేసి ఏ సర్టిఫికెట్ కు దరఖాస్తు చేస్తున్నారో అన్ని వివరాలను మీసేవ పోర్టల్ లో పొందుపరిచి ఆన్లైన్ ద్వా రా రెవిన్యూ ఆఫీసుకు వెళుతుంటాయి. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత సర్టిఫికెట్స్ పొం దేందుకు రుసుమును ఆన్లైన్లో కట్టవలసి ఉం టుంది. మీసేవ నుండి సర్టిఫికెట్ యొక్క ఆన్లైన్ రిసిప్టును ఇస్తారు.
నిర్ణీత దరఖాస్తును రెవెన్యూ అధికారులు ముందుగా ధ్రువీకరించవలసి ఉంటుంది. తరువాత దానిని ఆన్లైన్ కు డిజిటల్ సంతకంతో తిరిగి మీసేవ పోర్టల్ కు పంపిస్తారు. తరువాత ఆ సర్టిఫికెట్స్ ను పొందవలసి ఉంటుంది. ఇలా భౌతికంగా దృవీకరించే సమయంలోనే ఏ సర్టిఫికెట్ కు అప్లై చేశారో అప్పుడే రెవిన్యూ అధికారులు అవినీతితో లంచాలకు పాల్పడుతున్నారు.
సర్టిఫికెట్స్ ను జారీ చేసేందుకు బహిరంగగానే మాకు పైసలు ఇస్తేనే సర్టిఫికెట్లు ఇ స్తామని గట్టిగా చెబుతున్నారని, పైసలు ఇవ్వకుంటే వివిధ కారణాలతో మీ అప్లికేషన్ ఫామ్ మాకు రాలేదని, అసలు ఆఫీసులోనే ఇవ్వలేదని ఇలా రకరకాలుగా ప్రజలను ఆఫీ స్ చుట్టూ తిప్పించుకుంటున్నారని, దరఖా స్తు చేసిన తేదీలోపు సర్టిఫికెట్స్ ను జారీ చే యవలసి ఉంటుంది.
కానీ రెవెన్యూ అధికారులు వివిధ కారణాలతో ఇబ్బందులకు గు రి చేస్తున్నారని విమర్శలు వెలువెత్తుతున్నా యి. కుల ధ్రువీకరణ ఆదయ ధ్రువీకరణ, స్థి ర నివాస ధ్రువీకరణ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్స్, వన్ బి సర్టిఫికెట్స్, ఇతర సర్టిఫికెట్స్ ను మీసేవ నుండి ప్రజలు పొందుతున్నారు.
ఇట్టి సర్టిఫికెట్స్ కు డిమాండ్ ఉండడంతో ప్రతి సర్టిఫికెట్ కు ఓ రేటు కట్టి ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇంత చేస్తున్నా, పై అధికారులు స్పందించడం లేదని జిల్లా కలెక్టర్ స్పందించి అవినీతి అధికారుల పై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు