30-09-2025 01:59:30 AM
తలకిందులైన ఆశావాహుల అంచనాలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రారంభమైన ఎన్నికల సందడి
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి):ఎప్పుడెప్పుడా అంటూ ఎదు రు చూస్తున్న స్థానిక సమరానికి నగరా మో గింది. రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేశారు. అంతకుముందే జెడ్ పీ టీ సీ, ఎం పీ టీ సీ, ఎం పీ పీ స్థానాలకు రిజర్వేషన్లు ఖ రారు చేయడంతో బరిలో నిలిచి పదవులు దక్కించుకోవాలని ఆశించిన ఆశావాహుల ఆశలు నిరాశలయ్యాయి.
42% బేసి రిజర్వేషన్ అమలు చేస్తూ ప్రభుత్వం జీవో విడు దల చేయడం, ఆ ప్రకారం జిల్లాలో ఎంపీపీ, జెడ్ పీ టీ సీ స్థానాలను రిజర్వేషన్లు నిర్ణయించడం జరిగింది. ఉమ్మడి జిల్లాల్లో జనర ల్ స్థానాల్లో చాలావరకు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించారు. ఐప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రిజర్వేషన్ ఖరారైన, జాబితాలను ఆయా పంచాయతీ కార్యాలయాల్లో అంటించడం జరిగింది.
ఒకవైపు రిజర్వేషన్ ఖరారు కావడం, మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల సందడి ప్రారంభమైంది. తమకు అనుకూలంగా రిజర్వేషన్లు వస్తాయ నే ధీమాతో ఉన్న ఆశావాహుల అంచనాలు తారు మారాయి.
రిజర్వేషన్లు ఇలా....
ఖమ్మం జిల్లాలో మొత్తం 19 జెడ్ పీ టీ సీ స్థానాలు ఉండగా, 4 జెడ్ పీ టీ సీ స్థానా లు ఎస్ సి లకు, 4 జెడ్ పి టి సి స్థానాలు ఎ స్‌టీ లకు, 8 జెడ్ పీ టీ సీ స్థానాలు బీసీలకు, 3 జెడ్ పీ టీ సీ అన్ రిజర్వుడు గా నిర్ణయించారు. 19 ఎంపీపీ స్థానాలు ఉండగా ఎస్ సీ లకు 4 స్థానాలు, ఎస్ టీ లకు 5 స్థానాలు,,బీ సీ లకు 8 స్థానాలు, 2 ఎంపీపీ స్థానాలు అండ్ రిజర్వుడుగా ఖరారు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 22 జెడ్ పీ టీ సీ స్థానాలు ఉండగా 1 జడ్ పీ టీ సీ స్థానాన్ని ఎస్ సీ, 10 స్థానాలను ఎస్ టీ లకు,7 స్థానం బీసీ లకు, 4 అండ్ రిజర్వుడు కేటాయించడం జరిగింది. 22 ఎంపీపీ స్థానాల గాను 20 స్థానాలను ఎస్ టీ లకు, ఒకటి బీసి, మరొకటి ఆన్ రిజర్వుడు గా ఖరారు చేశారు. 2019 లో జరిగిన రిజర్వేషన్ ప్రక్రియకు, 2025 కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రిజర్వేషన్లు జనరల్ స్థానాల్లో చాలావరకు ఎస్ టి, ఎస్ సి స్థానాలుగా ఖరారు అయ్యాయి.