calender_icon.png 6 May, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలికలు విద్యావంతులైతేనే సమాజంలో మార్పు

06-05-2025 12:01:03 AM

  1. వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ  

జోగిపేట నర్సింగ్ కాలేజీకి నూతన బస్సు అందజేసిన మంత్రి 

సంగారెడ్డి, మే 5(విజయక్రాంతి):బాలికలు విద్యావంతులైతేనే సమాజంలో మా ర్పు వస్తుందని రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో సిఎస్‌ఆర్ నిధుల నుంచి తోషిబా కంపెనీ ద్వారా ప్రభు త్వ నర్సింగ్ కళాశాల జోగిపేట్ అందోల్ కు నూతన బస్సును జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరుతో కలిసి జెండా ఊపి మంత్రి ప్రారంభించారు.

అనంతరం బస్సులో విద్యార్థులతో మంత్రి దామోదర్ రాజనర్సింహ, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు కలిసి ప్రయాణించారు. ఈ సందర్భంగా మంత్రి రాజనర్సింహ మా ట్లాడుతూ సమాజంలో మార్పు రావాలంటే, సమాజం ఉన్నతంగా తీర్చిదిద్దాలం టే, సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను రూపుమాపాలంటే బాలికలు అత్యంత వి ద్యావంతులై ఉండాలన్నారు.

నూతన బస్సు ను ప్రారంభించినందుకు విద్యార్థులు దా మోదర్ రాజనర్సింహకు ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, తోషిబా కంపెని ప్రతినిధులు, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.