29-08-2025 12:33:10 AM
ప్రకటించిన జేఎన్టీయూ, శాతవాహన, కాకతీయ వర్సిటీ
పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తామన్న వర్సిటీలు
హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పలు యూనివర్సిటీలు పరీక్షలను వాయిదా వేశాయి. ఈమేరకు ఆయా వర్సిటీలు ప్రకటించాయి. ఈనెల 29, 30వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు జేఎన్టీయూహెచ్ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది.
వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో గురువారం, శుక్రవారం జరగాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలను వాయిదా వేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్సిటీ అధికారులు ప్రకటించారు. అదేవిధంగా కరీంనగర్ శాతవాహన వర్సిటీ పరిధిలో గురువారం జరగాల్సిన బీఎడ్, ఎంఎడ్ పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
మిగతా పరీక్షలు మాత్రం యథావిధిగా జరుగుతాయని అధికారులు తెలిపారు. అయితే వాయిదా వేసిన పరీక్షల తేదీలను త్వరలో ప్రటిస్తామని ఆయా వర్సిటీలు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నాయి.