16-05-2025 01:41:14 AM
-ఉగ్రస్థావరాలు, ఐఎస్‌ఐ నెట్‌వర్క్ అంతమే మోదీ ధ్యేయం
- మహిళామోర్చా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి
హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): యూపీఏ హయాంలో దేశంలో అనేక ఉగ్రవాద కార్యకలాపాలు జరిగాయని, ఘటన లు జరిగినప్పుడు కేవలం సంతాపాలు ప్రకటించి మర్చిపోయేవారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
కానీ గత పదేళ్లుగా ప్రధాని నరేంద్రమోదీ నా యకత్వంలో భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయడంతో పాటు ఐఎస్‌ఐ నెట్‌వర్క్‌ను అంతం చేసి నూతన అధ్యాయానికి నాంది పలికిందని తెలిపారు. ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా పూర్తికాలేదని, పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించినా, భారత సౌభ్రాతృత్వాన్ని దెబ్బతీసే ప్ర యత్నం చేసినా ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో గురువారం జరిగిన మహిళా మోర్చా సమావేశానికి కిషన్‌రెడ్డి హాజరై మాట్లాడారు.. దేశంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పాలనలో ఎన్నో ఉగ్రదాడులు జరిగాయని, జమ్మూకశ్మీర్‌లో పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాల వల్ల 46 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారని, అయినా ఏమి పట్టించుకోలేదని ఆరోపించారు.
ప్రధాని మోదీ మా త్రం.. ‘భారత్‌పై దాడి చేస్తే మేం కేవలం క్యాం డిల్ లైట్స్ వెలిగించం.. బ్రహ్మోస్ ప్రయోగిస్తాం..’అని దేశ ప్రజలకు భరోసా కల్పిం చారన్నారు. దేశ రక్షణ కోసం పోరాడుతున్న భారత సైనికులకు మద్దతుగా ఈనెల 17న హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహించే తిరంగ ర్యాలీలో రాజకీయాలకు అతీతంగా ప్రతిఒక్కరూ పాల్గొనాలని కిషన్‌రెడ్డి కోరారు.