calender_icon.png 11 May, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లలకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవు: సిఐ రామకృష్ణ రెడ్డి

10-05-2025 11:15:35 PM

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వుల ప్రకారం మునగాల సర్కిల్ పరిధిలోని మునగాల నడిగూడెం మోతే పోలీస్ స్టేషన్లలో గత వారం రోజుల నుంచి మైనర్ డ్రైవింగ్ చేసినటువంటి వ్యక్తుల యొక్క మోటార్ సైకిళ్లను పోలీస్ స్టేషన్లో పట్టుకొని  సీఐ రామకృష్ణారెడ్డి  ఆధ్వర్యంలో మూడు మండలాలకు సంబంధించిన మైనర్ డ్రైవింగ్ చేసినటువంటి వ్యక్తులు  వారి తల్లిదండ్రులు అందరినీ  సిఐ  ఆఫీస్ యందు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా సిఐ రామకృష్ణ  రెడ్డి మాట్లాడుతూ... ఎవరైనా మైనర్ పిల్లలకి వెహికల్స్ ఇచ్చినట్లయితే వారి పైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకొని వారి వెహికల్స్ ని సీజ్ చేయడం జరుగుతుంది అలానే మైనర్స్ యొక్క పేరెంట్స్ పైన కూడా చట్ట ప్రకారం చర్య తీసుకొనబడుతుంది  దాదాపుగా 40 మంది మైనర్ డ్రైవింగ్ చేసిన వ్యక్తులు  80 మంది వరకు వారి పేరెంట్స్ ఎట్టి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్. నడిగూడెం ఎస్ఐ నరేష్. మోతే ఎస్ఐ యదవేందర్ రెడ్డి. కానిస్టేబుల్ శివ మైనర్ తల్లిదండ్రులు  పాల్గొన్నారు.