calender_icon.png 16 October, 2025 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతోన్మాద రాజకీయాలను వ్యతిరేకించండి

16-10-2025 02:35:40 AM

తుర్కయంజాల్, అక్టోబర్ 15: దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే ధ్యేయంగా మతోన్మాద రాజకీయాలను వ్యతిరేకించాలని, కార్మికులంతా ఐక్యంగా ఉండి పోరాటాలు కొనసాగించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ర్ట నూతన అధ్యక్ష కార్యదర్శులు పాలడుగు భాస్కర్, రాజమల్లు పిలుపునిచ్చారు. యూనియన్ రాష్ర్ట 5వ మహాసభల్లో భాగంగా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి రాగన్నగూడలో రెండోరోజు ప్రతినిధుల సభ నిర్వహించారు.

మూడేళ్లకాలంలో నిర్వహించిన ఉద్యమాలు, పోరాటాలపై సమీక్షించారు. భవిష్యత్తులో నిర్వహించాల్సిన పోరాటాలపై తీర్మానాలు చేశారు. అనంతరం నూతన రాష్ర్ట కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా భాస్కర్, రాజమల్లు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం రూ.26వేలు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రమాదాల్లో చనిపోయిన కార్మికులకు రూ.20లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో కార్మికులకు తొలి ప్రాధాన్యమివ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్‌కోడ్‌లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

నూతన రాష్ర్ట కమిటీ

రాష్ర్ట అధ్యక్షుడు పాలడుగు భాస్కర్, ప్రధాన కార్యదర్శి జనగం రాజమల్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ పాలడుగు సుధాకర్, కోశాధికారి అశోక్ తో పాటు 29 మంది ఆఫీస్ బేరర్స్, 130 మందితో రాష్ర్ట కమిటీని ఎన్నుకున్నారు.