calender_icon.png 16 October, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వీట్‌షాపుల్లో అపరిశుభ్రత

16-10-2025 02:36:03 AM

-దీపావళి వేళ జీహెఎంసీ తనిఖీలు

హైదరాబాద్,సిటీ బ్యూరో అక్టోబర్ 15 (విజయక్రాంతి ): దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ, పౌరుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జీహెఎంసీ ఆహార భద్రతా విభా గం అధికారులు నగరంలోని స్వీట్ దుకాణాలపై ప్రత్యేక దాడులు నిర్వహిస్తోంది. నాణ్య త, పరిశుభ్రతా ప్రమాణాలను తనిఖీ చేస్తోంది. ఈ తనిఖీల్లో స్వీట్ షాపుల్లో అడుగడుగునా అపరిశుభ్రత ఉన్నట్లు, మిఠాయి లకు తయారీతేదీ, గడువు తేదీ లేనట్లు అధికారులు గుర్తించారు.

జీహెఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో ఇప్పటివరకు నగరంలోని 27 స్వీట్ షాపులపై దాడులు నిర్వహించారు. ప్రతి మిఠా యిపై దాని తయారీ తేదీ, గడువు తేదీ తప్పనిసరిగా ప్రదర్శించాలని అధికారులు యాజ మాన్యాలకు స్పష్టం చేశారు. పలు దుకాణాల్లో  ఆహార భద్రత, ప్రమాణాల చట్టం, 2006 ప్రకారం పాటించాల్సిన కనీస నిబంధనలను సైతం యాజమాన్యాలు గాలికి వదిలేసినట్లు అధికారులు గుర్తించారు.

నిబంధనలు ఉల్లంఘించిన యాజ మాన్యా లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. లోపాలను సరిదిద్దుకోవాలని లేకపోతే కేసు లు నమోదు చేయనున్నట్లు హెచ్చ రించారు. పండుగ పూర్తయ్యే వరకు ఈ తనిఖీ లు నగరవ్యాప్తంగా కొనసాగుతాయని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని జీహెచ్‌ఎంసీ, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, పి.మూర్తి రాజు హెచ్చరించారు.