26-11-2025 12:00:00 AM
-ఎన్‌ఎంఓపీఎస్ సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ
-ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన
హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా పాత పెన్షన్ వ్యవస్థ ను పునరుద్ధరించాలని నేషనల్ మూవ్‌మెంవ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్‌ఎంఓ పీఎస్) ఉద్యోగుల సంఘం అవిశ్రాంతంగా పోరాడుతోందని ఆ సంస్థ జాతీయ సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ అన్నారు. మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దేశవ్యాప్తం గా వేలాది మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అధికారులు పాత పెన్షన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ భారీ స్థాయిలో నిరసన చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఎన్‌ఎంఓపీఎస్ జాతీయ అధ్యక్షుడు వికె.బంధు, సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ మాట్లాడారు. జవాన్లతో సహా దేశవ్యాప్తంగా కోటి మంది ఉద్యోగులు ఉన్న ఒక్క ఓపీఎస్‌ను కోల్పోయారన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు, పంజాబ్ పాత పెన్షన్‌ను పూర్తిగా అమలు చేయాలని కోరారు. నిరసన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్‌తో పాటు నాయకులు పవన్, వెంకటేశ్, నరేంద్రరావు, శ్యాంసుందర్, చంద్రకాంత్ పాల్గొన్నారు.