12-09-2025 11:25:55 PM
నకిరేకల్(విజయక్రాంతి): నకిరేకల్ పట్టణంలోని మూసి రోడ్డులో యంగలి గోపి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన జై హనుమాన్ ఆర్గానిక్ ఆయుర్వేదిక్ దుకాణాన్ని శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం ప్రజలకు ఆర్గానిక్ ఆయుర్వేద మందులు వాడటం వల్ల జరిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు యంగలి గోపి సౌమ్య, ఐఎంసి కంపెనీ ప్రతినిధి లక్ష్మీనారాయణ, లతీఫ్, రాచకొండ యాదగిరి, రాచకొండ అంజయ్య, రాచకొండ గోపి పాల్గొన్నారు.