calender_icon.png 24 November, 2025 | 12:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కురుమ కులస్తుల అభివృద్ధే మా లక్ష్యం

24-11-2025 12:01:56 AM

-కురుమ యువ చైతన్య సమితి 

ఖైరతాబాద్; నవంబర్ 23 (విజయక్రాంతి) : గొర్రె కాపరుల కోసం ప్రతి గ్రామంలో 10 ఎకరాల భూమిని కేటాయించాలని కురుమ యువ చైతన్య సమితి(కే వై సి) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కేవైసీ నూతన కమిటీ, భవిష్యత్తు కార్యాచరణ పై సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా సమితి గౌరవాధ్యక్షుడు సత్యన్న, అధ్యక్షుడు మహేందర్ తదితరులు మాట్లాడారు .. తెలంగాణ రాష్ట్రంలో 14 శాతానికి పై గల కురుమ కులస్తుల అభివృద్ధి కి పాల్పడడంతోపాటు రాజకీయ వాటా సాధించడమే తమ సంఘం లక్ష్యం అని తెలిపారు.50 సంవత్సరాలు నిండిన ప్రతి గొర్రెల కాపరికి పెన్షన్, ప్రతి ఒగ్గుడోలు కళాకారునికి శాశ్వత ఐడి కార్డులతో పాటు పెన్షన్ ను  ఇవ్వాలని అన్నారు.

గొర్రెల కాపరుల పైన దాడి చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకుని చట్టరీత్య క్రిమినల్ కేసులు బుక్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల అధ్యక్షులు, నూతన కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.