24-11-2025 12:00:26 AM
మహిళలను అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ లక్ష్యం
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఏళ్ల బాల్ రెడ్డి
ముస్తాబాద్, నవంబర్ 23( విజయ క్రాంతి )రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రం అలాగే మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.పోతుగల్ గ్రామంలోని రైతు వేదికలో చీరల పంపిణీ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షుడు బాల్రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్,ఎంసీ చైర్మన్ తలారి రాణి నర్సయ్య,ఎన్నారై జేఏసీ జిల్లా కన్వీనర్ తోట దర్మేందర్ హాజరై ప్రసంగించారు.
మహిళ ఉన్నతి తెలంగాణ ప్రగతి అనే నినాదాన్ని తీసుకొని రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పెట్టిన ప్రతి పథకంలో మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళ మూర్తులను ముందుండి నడిపిస్తుందన్నారు.ఒక కుటుంబం అభివృద్ధి చెందాలంటే భర్తకు తోడుగా భార్య సంపాదన ఉండాలనే ఆలోచనతో మహిళలకు అన్ని రంగాల్లో పెద్ద పీట వేయడం జరుగుతుందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే 500 కే సిలిండర్ అలాగే 2 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలు మహిళా అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు.గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని,రైతు బందు పేరుతో అక్రమంగా దోచుకున్నారని తెలిపారు.మన ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చి నిజమైన రైతులకు రైతు బందు ఇస్తున్న ఘనత అని కొనియాడారు.
మహిళా శక్తి స్వశక్తి గ్రూప్ ల ద్వారా ఆర్థికంగా బలపడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. అదేవిధంగా మహిళలకు మహిళా సంఘాల ద్వారా ఐకెపి సెంటర్లను,పెట్రోల్ పంపులను అప్పగించి మహిళల అభివృద్ధిలో నడిపిస్తూ ప్రభుత్వం తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు అనమేని రాజు, ఏపీఎం కళ్యాణి,విపివో, గ్రామ శాఖ మహిళా అధ్యక్షురాలు సంతోష,కిరణ్, వెంకటేష్,జంగ రాజు వివో లు నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.